ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Health:బాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వని అధికారులు... ఆందోళనలో అభిమానులు, కార్యకర్తలు

ABN, First Publish Date - 2023-10-15T13:30:57+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు.

రాజమండ్రి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా నిరసనలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి జైలులో ఉన్న బాబు ఆరోగ్యంపై ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నా.. అధికారులు నిరాకరిస్తున్నారు. బాబు హెల్త్ బులిటెన్(Health Bulletin) ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.


ఈ నెల 12న బాబుకి స్కిన్ ఎలర్జీ వచ్చిందని.. పలు ఆరోగ్య సమస్యలు ఆయన్ని వెంటాడుతున్నాయని రిపోర్టులు బహిర్గతం కావడంతో సీఎం జగన్(Jagan) ప్రభుత్వం ఇరకాటంలో పడింది. జైలులో అందరికీ ఒకే రకమైన రూల్స్ ఉంటాయంటూ మంత్రులు కవర్ చేసుకునే పనిలో పడ్డారు. కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ అడిగినా పోలీసులు ససేమిరా అంటున్నారు. బాబు ఆరోగ్యంతో జగన్ సర్కార్ చెలగాటమాడుతోందనే ఆరోపణలతో అధికార పార్టీ నేతలు ఉక్కిరి బిక్కిర అవుతున్నారు. ఆయనకు సంబంధించిన రిపోర్టులు బయటకి ఎలా వెళ్లాయంటూ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నివేదికలు బయటకు వెళ్లకుండా చూడాలని జైలు అధికారులకు అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్‌ఆర్సీపీ నేతల ఒత్తిడితోనే హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయట్లేదని టీడీపీ(TDP) శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2023-10-15T13:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising