ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: ఉమ్మడి పశ్చిమలో 98.46 శాతం పోలింగ్‌

ABN, First Publish Date - 2023-03-13T19:27:36+05:30

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) స్థానిక సంస్థల నుంచి రెండు ఎమ్మెల్సీ పదవులకు సోమవారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 1105 మంది ఓటర్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) స్థానిక సంస్థల నుంచి రెండు ఎమ్మెల్సీ పదవులకు సోమవారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 1105 మంది ఓటర్లకు గాను 1088 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం (Eluru Jangareddygudem), నరసాపురం, భీమవరం కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్‌ కొనసాగింది. తొలుత మందకొడిగా ఆరంభమై చివరకు నాలుగు గంటలకు పోలింగ్‌ పరిసమాప్తి నాటికి 98.46 శాతం మేర ఓటింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పోలింగ్‌ (Polling)కు ముందురోజు ఆదివారం రాత్రి వైసీపీ ఓటర్లకు నగదు, సెల్‌ఫోన్‌లు, వెండి గ్లాసులు ఎక్కడికక్కడ పంపిణీకి తెగబడింది. మంత్రులు కొట్టు సత్యనారాయణ భీమవరంలోను, హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరులోను, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నరసాపురంలోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి, జడ్పీ చైర్మన్‌ కౌరు శ్రీనివాస్‌ నరసాపురంలోనే ఓటు వేశారు. నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju)తోపాటు ఎమ్మెల్సీలు షేక్‌ సాబ్జీ, మంతెన సత్యనారాయణరాజు వంటి వారితో సహా 17 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు.ఎటువంటి వివాదం లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

Updated Date - 2023-03-13T19:27:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising