KA Paul: జగన్‌కు చేతులు జోడించి అడుగుతున్నా...
ABN, First Publish Date - 2023-08-02T14:23:28+05:30
వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
రాజమండ్రి: వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరద బాధితుల వద్దకు వెళ్ళలేదని.. అధికారులెవ్వరూ వరద బాధితులను పట్టించుకోలేదని విమర్శించారు. వరద బాధితులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలన్నారు. గడప గడపకు పేరుతో ఓట్లు కోసం వస్తారని.. ఓటర్లు గమనించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థలను మూసివేసిందని మండిపడ్డారు. ఏపీని మోదీ సర్వనాశనం చేశారన్నారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ పట్టించుకోవటం లేదని.. పవన్ ఏపీ ప్రజలను మోదీ దగ్గర తాకట్టుపెడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్ వైపల్యాలపై ప్రాణమున్నంత వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగన్‌కు చేతులు జోడించి అడుగుతున్నానన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఎన్నికల ముందు ఏపీలో సమ్మిట్ పెడితే లక్ష కోట్లు తెస్తానని.. లక్ష కోట్లు తీసుకురాకపోతే ఏపీ ప్రజలు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తానన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరత్వం లేక కాపులు దూరంగా ఉంటున్నారని కేఏపాల్ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-08-02T14:23:57+05:30 IST