ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: చంద్రబాబును పదే పదే ఆ మాటంటూ రెచ్చిపోయిన జగన్

ABN, First Publish Date - 2023-04-12T13:35:57+05:30

వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రకాశం: ‘‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’’ నిధుల విడుదల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు (TDP Chief)ను ముసలాయనా అంటూ సంబోధిస్తూ ప్రసంగించారు. గతంలో ఒక ముసలాయన సీఎంగా ఉన్నపుడు ఈ పథకాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఉన్నదేంటి.. దోచుకో, తినుకో, పంచుకో.. అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతీ లబ్ధిదారుడికి పారదర్శకంగా నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ అవుతుందన్నారు. ఆ ముసలాయన హయాంలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లోకి వేశారా అని ప్రజలకు అడిగారు. గతంలో జరగనివి.. ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ఆలోచన చేయాలన్నారు. ఈ డబ్బంతా ఆ ముసలాయన పాలనలో ఎవరు దోచుకున్నారు.. ఎవరు పంచుకున్నారు.. ఎవరు తిన్నారు అని ప్రశ్నించారు. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ముసలాయాన మాట్లాడడు అంటూ చంద్రబాబును పదే పదే ముసలాయన అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు.

సెల్ఫీ ఛాలెంట్ అంటే అది....

‘‘సెల్ఫీ అంటాడు.. నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు.. ఫేక్ ఫోటోలతో సేల్ఫీ ఛాలెంజ్ అంటాడు.. ఛాలెంజ్ అంటే అవికాదు.. ప్రతీ పేదవాడి ఇంటి ముందు నిలబడి ఈ ఇంటికి మా వల్ల జరిగిన లబ్ది అని చెప్పగలగడం ఛాలెంజ్.. నువ్వు బాగా చేశావయ్యా అని పేదలు అనగలిగితే దాన్ని అంటారు సెల్ఫీ అని. పేద వాడికి చేసిన మంచి ఎంతో చెప్పే సత్తా ఉందా చంద్రబాబు.. నిజాలు దాచి నిందలు, అబద్ధాలు దాచి ప్రచారాలు చేస్తారు.. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజాలు అని చెప్పే ప్రయత్నం.. గత పాలనలో వారేం చేశారో చెప్పాలి.. సెల్ఫీ దిగే నైతికత, పాలన గురించి ఇంటికి స్టిక్కర్ వేసే ధైర్యం ఉందా.. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను రోడ్లమీద నిలబెట్టారు.. ఈ మోసాల బాబును గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-12T13:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising