Lokesh YuvaGalam: 169వ రోజుకు యువగళం పాదయాత్ర.. వృత్తి నిపుణులతో లోకేశ్ ముఖాముఖి
ABN, First Publish Date - 2023-07-29T15:40:54+05:30
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగుతోంది.
ప్రకాశం: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో యువనేత పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు 169వరోజు అద్దంకి నియోజకవర్గం గుండ్లాపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలుకానుంది. అంతకుముందు ముద్దిపాడు మండలం గుండ్లాపల్లి దగ్గర వృత్తి నిపుణులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంస పాలన ప్రారంభమైందన్నారు. అమర్‌రాజా, రిలయన్స్, లులూ కంపెనీలను తరిమేశారన్నారు. వైసీపీ పాలనలో ఒక్క మంచి కంపెనీ అయినా ఏపీకి వచ్చిందా అని ప్రశ్నించారు.అన్ని రంగాల నిపుణలు జగన్ బాధితులే ఉన్నారని తెలిపారు. లాయర్లు, టీచర్లు, వైద్యులు కూడా జగన్ రెడ్డి బాధితులే అని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) రావాలని అన్నారు. జగన్‌రెడ్డి (AP CM Jagan reddy) రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారని మండిపడ్డారు. విద్యా వ్యవస్థను కూడా జగన్ పూర్తిగా విధ్వంసం చేశారన్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా మార్చుతామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. యూపీపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తామన్నారు. మెగా డీఎస్సీ, పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామన్నారు. విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. లాయర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-07-29T15:40:54+05:30 IST