మూగజీవాలకు దాహం..దాహం..

ABN , First Publish Date - 2023-03-06T00:32:58+05:30 IST

అడవిలోని చిన్న చిన్న కుంటల్లో నీరు ఎండిపోవడంతో మూగజీవాల నాలుకలు పిడసగట్టుకు పోతున్నాయి.

మూగజీవాలకు దాహం..దాహం..

పుల్లలచెరువు, మార్చి 5: అడవిలోని చిన్న చిన్న కుంటల్లో నీరు ఎండిపోవడంతో మూగజీవాల నాలుకలు పిడసగట్టుకు పోతున్నాయి. తాగునీటి కోసం అవి నిత్యం అడవిని జల్లెడపడు తున్నా, గుక్కెడు నీరు దొరకడం లేదు.

పుల్లలచెరువు మండలంలో కరువు విలయతాండవం చేస్తోంది. గ్రామాల్లో తాగునీటి కొరతతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. సాగు చేసిన పంటలు మధ్యలోనే ఎండిపోతుం డటంతో కొందరు రైతులు సాగు నీటి కోసం ట్యాంకర్ల ద్వారా నీరు పెట్టుకోని పంటలను కాపాడుకుంటున్నారు. పుల్లలచెరువు మండ లంలో వర్షపాతం మరీ తక్కువగా నమోదు కాకపోవడంతో గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. 800 అడుగులు బోరు వేసినా, చుక్కనీరు పడడం లేదు. దీంతో గతేడాది రబీలో కురిసిన స్వల్ప వర్షాలకు అటవీ ప్రాంతంలోని చిన్నకుంటల్లో చేరిన నీరు డిసెంబరు నాటికే ఎండిపోయాయి. దీంతో అక్కపాలెం, గారపెంట, నరజాము లతాండ, మురికిమల,్ల చెన్నంపల్లి, మర్రివేము ల అటవీ ప్రాంతాల్లో అడవి జంతువులు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. గత నెల 10న పుల్లలచెరువు మండలం అక్కపాలెం సమీపం లోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఒక పులిని గుర్తించారు. అప్పటి నుంచి శతకోడు పంచాయతీ ట్యాంకర్ల ద్వారా అటవీశాఖ అధికారులు రెండురోజులకు ఒక్క ట్యాంకరు నీటిని చిన్న కుంటలోని గుంటను నింపుతున్నారు. దీంతో రాత్రి వేళలో అటవీ జంతువులు దహం తీర్చుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నల్లమల పారెస్టు లోని నీళ్ల జాడలేని ప్రాంతాల్లో అటవీ జంతువుల కోసం తోట్టెలను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నిత్యం సరాఫరా చేయాలని, వేసవి నుంచి జీవాలను రక్షించాలని జంతుప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-06T00:32:58+05:30 IST