ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Balineni Srinivas: జగన్ పర్యటనకు వచ్చి.. వెంటనే వెనుదిరిగిన బాలినేని.. అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-04-12T10:39:33+05:30

మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి చేదు అనుభవం ఎదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రకాశం: మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి (Former Minister Balineni Srinivas Reddy) చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు మార్కాపురంలో సీఎం జగన్ (CM Jagan) పర్యటించనున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం బాలినేని శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. అయితే బాలినేనికి ప్రొటోకాల్‌లో అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరుపై మండిపడ్డ బాలినేని... సీఎం సమక్షంలో జరుగనున్న ‘‘ఈబీసీ నేస్తం’’ కార్యక్రమంలో పాల్గొనకుండానే ఒంగోలుకు వెళ్లిపోయారు. బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

మరోవైపు ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మార్కాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జగన్‌కు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో రెండవ విడత వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమ చేయనున్నారు.

Updated Date - 2023-04-12T10:45:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising