ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC election: ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: ముఖేష్ కుమార్ మీనా

ABN, First Publish Date - 2023-03-12T19:15:50+05:30

ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) ఏర్పాట్లు పూర్తి చేశామని ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. రేపు (సోమవారం) ఉదయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC election) ఏర్పాట్లు పూర్తి చేశామని ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) తెలిపారు. రేపు (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తామని తెలిపారు. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 3 లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఓటర్లు 10 లక్షల 519 మంది, టీచర్స్ ఎమ్మెల్సీల ఓటర్లు (Voters) 55,842 మంది లోకల్ బాడీ ఎమ్మెల్సీల ఓటర్లు 3,059 మంది ఉన్నారని తెలిపారు. మొత్తం 1538 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాయని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.

ఓటు వినియోగంలో జాగ్రత్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఓటర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఓటు వేయడానికి బ్యాలెట్‌ పేపరుతోపాటు ఇచ్చిన వైలెట్‌ స్కెచ్‌ పెన్‌ మాత్రమే వినియోగించాలని, ఇతరత్రా పెన్సిల్‌, పెన్ను, బాల్‌పాయింట్‌ పెన్ను వినియోగించరాదన్నారు. మొదటి ప్రాధాన్యంగా ఎంచుకున్న అభ్యర్థి పేరుకు ఎదురుగా ఇవ్వబడిన కాలమ్‌లో ‘1’ అని...ప్రాధాన్య క్రమంలో తదుపరి అభ్యర్థులకు వరుసగా 2,3,4,5...అని కాలమ్‌లో రాయాలని సూచించారు. ప్రాధాన్యతలను సంఖ్య రూపంలో సూచించాలి తప్ప పదాల రూపంలో రాయకూడదన్నారు. బ్యాలెట్‌ పేపర్‌పై పేర్లు రాయడం గానీ, వేలిముద్రలు రాయడం గానీ చేయరాదన్నారు. ప్రాధాన్యం సూచించడానికి టిక్‌ మార్కు, క్రాస్‌ మార్కుపెట్టవద్దని అటువంటి బ్యాలెట్‌ పేపరు చెల్లదని అధికారులు వివరించారు.

Updated Date - 2023-03-12T19:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising