BJP: ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ పురందేశ్వరి
ABN, First Publish Date - 2023-06-11T19:25:06+05:30
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురందేశ్వరి (Purandeswari) తీవ్రస్థాయితో మండిపడ్డారు. అరాచక పాలనతోనే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని
విశాఖ: ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురందేశ్వరి (Purandeswari) తీవ్రస్థాయితో మండిపడ్డారు. అరాచక పాలనతోనే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, వచ్చిన పారిశ్రామికవేత్తలు కూడా పారిపోతున్నారని తెలిపారు. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా విశాఖలోని రైల్వేగ్రౌండ్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ 9 ఏళ్లలో దేశానికి ఏం చేశామో ప్రజలకు చెప్పే ధైర్యం తమకు ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లి ఇది చేశాం అని చెప్పుకునే దమ్ము వైసీపీ (YCP)కి ఉందా? అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే దిశగానే పాలన జరగాలని పురందేశ్వరి ఆకాంక్షించారు.
ఏపీకి రాజధాని ఉండాలా.. వద్దా?
‘‘ఏపీకి రాజధాని ఉండాలా.. వద్దా?.. జగన్ చెప్పాలి. తాత, తండ్రి పేరు చెప్పుకుని మేం రాజకీయాలు చేయడం లేదు. విశాఖలో ఎక్కడ చూసినా కబ్జాలు, అక్రమాలే. ఒక్కసారి అధికారంలోకి వచ్చినందుకే జగన్‌కు ఇంత గర్వమా?.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపైనే జేపీ నడ్డా మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదని బీజేపీ నేత జేపీ నడ్డా అనడం తప్పా?’’ బీజేపీ నేత సత్యకుమార్ ప్రశ్నించారు.
Updated Date - 2023-06-11T19:25:06+05:30 IST