ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్.. ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరిక

ABN, First Publish Date - 2023-12-09T19:14:16+05:30

కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

అమరావతి: కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్ల అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహూపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తే రూ. 200 కోట్ల నగదు అధికారికంగా లెక్క తేల్చారని ఆమె గుర్తు చేశారు. అయితే లెక్క తేల్చాల్సిన నగదు ఇంకా ఉందని అధికారులు చెబుతున్న తీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ఎంపీల అవినీతి ఎంత అన్నది తేలుతోందన్నారు. నాటు సారాతో ఈ సొమ్ము సంపాదించినట్లుగా తెలుస్తోందని, ఇదంతా నల్లధనమే అన్నవిషయం ప్రజలకు అర్ధం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధీరజ్ సాహూ కుటుంబ సభ్యులపై జరుగుతున్న దాడుల్లో లెక్కకు మించిన నల్లధనం వెలుగు చూస్తోందన్నారు.

కూటమి నాయకుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీని ఓడించడం కోసమే కూటమి అంటున్నారు. అయితే కూటమిలో ఉన్న అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాయని పురందేశ్వరి ఆరోపించారు. బెంగుళూరులో ఒక కాంగ్రెస్ నేత ఇంటిపై దాడులు జరిగితే రూ. 42 కోట్ల నగదును అధికారులు గుర్తించారని ఆమె చెప్పారు. పశ్చిం బెంగాల్ లోని చటర్జీ అనే మంత్రి ఇంట్లో రూ.50 కోట్ల నగదు దొరికిందని, ఉత్తర ప్రదేశ్ లో పీయూష్ జైన్ ఇంట్లో రూ.200 కోట్లు లభ్యం అయిన సంఘటన చూశామని, ఇటువంటి అవినీతి పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని పురందేశ్వరి హెచ్చరించారు.

Updated Date - 2023-12-09T19:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising