ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari : ఏపీ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలి

ABN, First Publish Date - 2023-10-24T13:52:33+05:30

రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని వినతిపత్రంలో కోరారు.

అమరావతి : రాష్ట్ర ఆర్థిక అంశాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వినతి పత్రం అందజేశారు. ఏపీ ఆర్థిక స్థితి అంచనా కోసం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని వినతిపత్రంలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వ కార్పోరేషన్ల పైన, బేవరేజ్ కార్పోరేషన్ వంటి సంస్థల పైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, చేసిన అప్పులు 10.77 లక్షల కోట్లు అంశాలు మీ దృష్టికి తేవడం జరిగిందని తెలిపారు. నేటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు అలాగే ఉందన్నారు.

ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి.. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురందేశ్వరి పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన ఈ సమాధానాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో తమ స్వంత కుటుంబ మీడియా ద్వారా, వలంటీర్ల ద్వారా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతిష్ట దెబ్బ తినే విధంగా చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను భవిష్యత్తులో కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని రకాల సావనీర్ గ్యారంటీలను, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఏఫ్ఆర్భీఏం పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - 2023-10-24T13:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising