Purandheshwari: దర్శి బస్సు ప్రమాదంపై పురంధేశ్వరి తీవ్ర విచారం
ABN, First Publish Date - 2023-07-11T10:23:19+05:30
ప్రకాశం జిల్లా దర్శి జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విజయవాడ: ప్రకాశం జిల్లా దర్శి జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బృందం బస్సులో ఏడుగురు మృతి, ప్రమాదంలో మరో 12 మందికి గాయాలపాలయ్యారన్నారు. గాయపడిన 12 మందికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. మృతుల కుటుంబాలకు పురంధేశ్వరి తీవ్ర సంతాపం తెలియజేశారు.
కాగా.. దర్శిలో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి సాగర్ కాలువలోకి పెళ్లి బస్సు దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. పొదిలి నుంచి కాకినాడలో వివాహ రిసెప్షన్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 47 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతులు : అబ్దుల్ అజీజ్(65), అబ్దుల్ హనీ(60), షేక్ రమీజ్(48), ముల్లా నూర్జాన్(58), ముల్లా జానీ బేగం(65), షేక్ షభీనా(35), షేక్ హీమా(7).
Updated Date - 2023-07-11T10:23:19+05:30 IST