Raghurama Krishnaraju : రజినీ కాంత్‌పై ప్రశంసలు.. జగన్‌పై విమర్శలు
ABN, First Publish Date - 2023-04-28T14:03:13+05:30
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనే కాదని.. ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
ఢిల్లీ : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రాష్ట్రంలోనే కాదని.. ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఎన్టీ ఆర్ శతజయంతి వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. రజినీకాంత్ అందరినీ సార్ అని మనసు పూర్తిగా పిలుస్తారని రఘురామ కొనియాడారు. నిన్న మొన్న ముఖ్యమంత్రి అయిన వారు అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి రఘురామ పరోక్ష విమర్శలు చేశారు.
స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అంకురార్పణ సభలో పాల్గొనేందుకు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Tamil Superstar Rajinikanth) శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో (Gannavaram Airport) రజినీకాంత్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే సూపర్‌స్టార్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ రజనీకాంత్, బాలయ్య పరస్పరం పలకరించుకున్నారు. ఆపై ఒకే కారులో ఇరువురు నోవోటెల్‌కు బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్‌కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ సూపర్‌స్టార్ వ్యాఖ్యానించారు. నోవోటెల్ హోటల్‌కు వెళ్లిన వెంటనే రజినీకాంత్‌తో బాలయ్య కాసేపు సమావేశమయ్యారు.
Updated Date - 2023-04-28T14:03:13+05:30 IST