ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP govt School: గొడుగులతో క్లాస్‌రూమ్‌కు విద్యార్థులు.. విస్సన్నపేట స్కూల్‌ పరిస్థితి ఇదీ...      

ABN, First Publish Date - 2023-07-26T16:19:24+05:30

విస్సన్నపేట జడ్పీ హైస్కూల్‌లో క్లాస్ రూమ్‌లు చెరువును తలపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేట జడ్పీ హైస్కూల్‌లో క్లాస్ రూమ్‌లు చెరువును తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే విస్సన్నపేట ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది. భారీ వర్షాల వల్ల పాఠశాలలోని క్లాస్‌రూమ్స్ నీట మునిగాయి. నాడు నేడు ద్వారా సుమారు 66 లక్షల రూపాయలు పనులు చేసినప్పటికీ అభివృద్ధి అనేది శూన్యం. పగిలిన రేకుల కింద వర్షపు నీటిలోనే విద్యార్థులు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. క్లాస్ రూమ్‌లో రేకులు పగిలిపోయి వర్షపు నీరు పడుతున్నప్పటికీ గొడుగులు వేసుకుని మరీ విద్యార్థులు క్లాస్‌రూమ్‌ల్లో కూర్చున్నారు. వర్షపు నీటిలో పాములు, జర్రులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. నీటిలో మునిగిన క్లాసులకు విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారు. స్కూల్ రూమ్‌లోకి వర్షపు నీరు రావడంతో నీటిని బయటకు చిమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు స్పందచకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-07-26T16:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising