ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanikath: ఉన్న విషయాలే చెప్పాను.. చంద్రబాబుపై నా అభిప్రాయం మారదు: రజనీకాంత్

ABN, First Publish Date - 2023-05-02T15:42:26+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్‌స్టార్‌, తలైవర్‌ రజనీకాంత్‌ (Rajanikanth) చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ‘టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ’ అంటూ తమిళ సూపర్‌స్టార్‌, తలైవర్‌ రజనీకాంత్‌ (Rajanikanth) చేసిన ప్రశంసల పట్ల వైసీపీ నేతలు స్పందించిన తీరుపై ఆయన అభిమానులు రగిలిపోతున్నారు. ఎవరిపట్ల అయినా మంచిగా స్పందించే రజనీ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు (YCP leaders) మాట్లాడడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, వేలూరు, కాంచీపురం తదితర జిల్లాలకు చెందిన అభిమానులు వైసీపీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘చంద్రబాబును రజనీ పొడిగితే వీళ్లకెందుకంత బాధ’ అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు (Chandrababu)కు రజనీకాంత్ ఫోన్ చేశారు. రజనీకాంత్‌పై వైసీపీ నేతల తీవ్ర విమర్శల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోవద్దని రజనీకాంత్‌ను చంద్రబాబు కోరారు. ‘‘ఎవరెన్ని విమర్శలు చేసినా స్పందించబోను. ఉన్న విషయాలే చెప్పాను.. నా అభిప్రాయం మారదు. సంయమనం పాటించాలని అభిమాన సంఘాలకు చెప్పాను’’ అని రజనీకాంత్, చంద్రబాబుతో అన్నారు.

వైసీపీ నేతలు తన పట్ల పెట్రేగిపోతున్నా రజనీ మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. అయితే ఆది నుంచి రజనీ తీరే అంత అని ఆయన గురించి బాగా తెలిసిన సీనియర్లు చెబుతున్నారు. నటి జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించినప్పుడు పోయెస్‌ గార్డెన్‌లో ఆమె నివాసానికి సమీపంలో ఉన్న రజనీ ఇంటి వద్ద అన్నాడీఎంకే నేతలు హడావుడి చేసేవారు. కనీసం రజనీ కుటుంబీకులు బయటకు వచ్చివెళ్లేందుకు కూడా అవకాశం లేకపోయేది. ఈ వ్యవహారం కాస్తా ముదరడంతో రజనీని ఉద్దేశపూర్వకంగానే అప్పట్లో జయలలిత ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసింది. నిజానికి డీఎంకే అధినేత కరుణానిధితో రజనీకి సన్నిహిత సంబంధాలున్నాయన్న కక్షతోనే నాటి ప్రభుత్వం అలా వ్యవహరించింది. అయినా రజనీ నోరు మెదపలేదు. అనంతర కాలంలో విడుదలైన ‘నరసింహ’ చిత్రంలోని దృశ్యాలను వీక్షించిన ప్రేక్షకులు.. వాటిని రజనీ ఉద్దేశంగా భావిస్తూ ఎవరికివారు అన్వయించుకున్నారు.

Updated Date - 2023-05-02T16:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising