ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్‌పై రాజ్‌నాథ్ సింగ్ అసంతృప్తి?

ABN, First Publish Date - 2023-09-15T10:49:01+05:30

కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

ఢిల్లీ : కేంద్ర రక్షణ మంత్రితో నేడు ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడం వంటి అంశాలు సైతం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు అరెస్ట్ పై రాజనాథ్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ పెద్దలు స్పందించలేదు.

ప్రస్తుతం ఏపీలో మారుతున్న పరిణామాలు.. మరి ఇంకా బెట్టు చేస్తే తమకు జనసేన కూడా దూరమవుతుందన్న ఆందోళన.. పైగా చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా మారాయన్న బీజేపీ రాష్ట్ర నేతలు ఇస్తున్న నివేదికలతో అధిష్టానం ఆలోచనలో పడినట్టు సమాచారం. పైగా బీజేపీ అండదండలతోనే చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంకా స్పందించకుంటే ఏపీలో పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నమై పోతుందని రాష్ట్ర నేతలు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌పై రాజ్‌నాథ్ అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దీనిలో భాగమేనని తెలుస్తోంది.

Updated Date - 2023-09-15T10:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising