Rapaka son Wedding: రాపాక కుమారుడి పెళ్లేమో గానీ.. డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయమేంటో తెలిస్తే...!

ABN, First Publish Date - 2023-06-07T15:31:44+05:30

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి కోసం డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయం హల్‌చల్ చేస్తోంది.

Rapaka son Wedding: రాపాక కుమారుడి పెళ్లేమో గానీ.. డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయమేంటో తెలిస్తే...!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబేద్కర్ కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rajolu MLA Rapaka Varaprasad Rao) కుమారుడు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి కోసం డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయం హల్‌చల్ చేస్తోంది. జూన్ 7 అంటే ఈరోజు(బుధవారం) ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కుమారుడి పెళ్ళికి అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పెళ్లికి ఒక్కొక్కరూ రూ.1500 ఇవ్వాలని నిర్ణయించారు. డ్వాక్రా యానిమేటర్ల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పలువురు యానిమేటర్లు అభ్యంతరం తెలుపుతున్న పరిస్థితి. పదిహేనువందల రూపాయలు కుదరదని.. రూ. 500 ఇస్తామని యానిమేటర్లు చెబుతున్నారు. అయితే యానిమేటర్ల సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు... ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వెడ్డింగ్ కార్డు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. పెళ్ళి పత్రికపై సీఎం జగన్ దంపతుల ఫోటోను అచ్చువేయించారు. ‘‘మాకు దైవసమానులైన మా ప్రియతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్ భారతమ్మ ఆశీస్సుల’’తో అంటూ పెళ్ళి కార్డులో పేర్కొన్నారు. ఈ పెళ్లి పత్రికను చూసి జనసేనతో పాటు ప్రజలు తమదైన రీతలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పెళ్లి పత్రికలో మీరే మా దేవుడు అంటూ అచ్చువేయడమే అతిగా కనిపిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా పెళ్లికి రూ.1500 డిమాండ్ చేయమేంటి అంటూ ఇదేం ఖర్మ రా బాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

Updated Date - 2023-06-07T15:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising