Somu Veerraju: రాష్ట్రంలో మతపరమైన పాలన సాగుతోంది: సోము వీర్రాజు
ABN, First Publish Date - 2023-03-26T20:02:59+05:30
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) మతపరమైన ప్రభుత్వంగా పరిపాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు.
నెల్లూరు: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt) మతపరమైన ప్రభుత్వంగా పరిపాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) మండిపడ్డారు. క్రైస్తవులను ఎస్సీల్లో చేర్చడం రాజ్యాంగ విరుద్దమని, దీనిని నిరసిస్తూ త్వరలో విజయవాడలో నిరసన తెలిపి గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. క్రైస్తవులకు చర్చిలు కట్టేందుకు ఖరీదైన భూములు ఎమ్మార్వోలకు కూడా తెలియకుండా అప్పగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలో పూర్తి వివరాలతో బీజేపీ (BJP) ముందుకు వచ్చి మతరాజకీయం చేస్తున్న వైసీపీపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చేలా నిరసనలు చేపడతామని అన్నారు. బీసీల సంక్షేమం కోసం కేంద్రం ప్రభుత్వం వివిధ రూపాల్లో రూ.5వేల కోట్లను రాష్ట్రానికి కేటాయించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను బీసీ వర్గాలకు ఇవ్వకుండా పక్కదోవ పట్టించిందని విమర్శించారు. అవహేళనగా మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఉద్యమాలు చేయడం సిగ్గుచేటని సోము వీర్రాజు విమర్శించారు.
Updated Date - 2023-03-26T20:02:59+05:30 IST