ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: వైసీపీకి ‘మూడి’నట్టేనా..? ఉత్కంఠగా మారిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఫలితం

ABN, First Publish Date - 2023-03-18T16:15:31+05:30

పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ జోరు కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: పశ్చిమరాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ జోరు కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీఎం జగన్రెడ్డి సొంత ఇలాకా పులివెందులలో కూడా వైసీపీ ఓటు బ్యాంకును టీడీపీ కొల్లగొట్టింది. పట్టభద్రుల ఓటు బ్యాంకు పూర్తిగా సైకిల్‌ వశమైంది. రెండు రోజుల వైసీపీ ఆధిక్యానికి రెండో ప్రాధాన్యత ఓట్లు చెక్‌ పెట్టాయి. వైసీపీని దాటుకొని టీడీపీ అభ్యర్థి రామ్‌గోపాల్రెడ్డి లీడ్లోకి వచ్చారు. పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) కూడా గెలుపు అంచుల్లో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఆధిక్యత కనబర్చారు. ఫలితాలు వెల్లడిలో ఇప్పటివరకు 41 మంది అభ్యర్థులను తొలగించి రెండో ప్రాధాన్యత ఓట్లను అధికారులు బదిలీ చేశారు. కేవలం 8 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కిస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థి ఆధిక్యత వల్లే ఫలితాల వెల్లడిలో అధికారులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణ వస్తున్నాయి. పదేపదే కౌంటింగ్ కేంద్రం నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి (Vennapusa Ravindra Reddy), మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి బయటకు వెళ్లి వస్తున్నారు. వైసీపీ నేతలు బయటకు వచ్చి మళ్లీ లోపలికి పోవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో (Rayalaseema East Graduate Constituency Election) టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC election of Uttarandhra graduates)ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు (TDP candidate Vepada Chirajeevi Rao) విజయదుందుభి మోగించారు. అయితే కౌంటింగ్ పూర్తైనప్పటికీ ఫలితాలు ప్రకటించడంలో అధికారులు కాలయాపన చేశారు. చివరకు ఈసీ (Election Commission) ఆదేశాలతో ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు అధికారులు డిక్లరేషన్ (Declaration) పత్రాన్ని అందజేశారు.

వైసీపీకి షాక్‌

వాస్తవానికి రాష్ట్రంలోని 90 శాతానికిపైగా స్థానిక సంస్థలు అధికార పార్టీ చేతిలోనే ఉంటాయి. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండూ వైసీపీ దక్కించుకుంది. ఉన్నతస్థాయి అధికారులే రంగంలోకి దిగి ఉపాధ్యాయులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరించి... బోగస్‌ ఓట్లు చేర్పించి, ప్రలోభాలకు గురి చేసినా... బొటాబొటి మెజారిటీయే లభించింది. ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా పోటీ చేయడంతో ఓట్లు చీలి పోయాయి. ఇది వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు కలిసి వచ్చింది. రాష్ట్రంలోని 108 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీకి ‘షాక్‌’ తగిలింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలిచారు. పశ్చిమ రాయలసీమలో కూడా టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా టీడీపీనే విజయం సాధిస్తే మూడు పట్టభద్రుల మూడు స్థానాలను క్లీన్‌చిప్ చేసినట్లు అవుతుంది.

Updated Date - 2023-03-18T16:26:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising