Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-01-29T14:28:56+05:30
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ (Phone) ట్యాప్ చేస్తున్నారని, తనపై నిఘా పెట్టారని ఆరోపించారు.
నెల్లూరు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ (Phone) ట్యాప్ చేస్తున్నారని, తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. పోలీసు, ఇంటెలిజెన్స్ (Police Intelligence) అధికారుల తీరుపై కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనేమైనా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనా?.. నా దగ్గర 12 సిమ్ కార్డులు ఉన్నాయి. టెలిగ్రామ్, వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడితే ఏం చేయగలరు?.. ఏపీ పోలీసు బాసు కూడా నన్ను ఏమీ చేయలేరు. 35ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా... ఎప్పుడు ఏమి చేయాలో తెలుసు’’ అని హెచ్చరించే దోరణిలో కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ (CM Jagan) పాలనపై పాలకపక్షంలోనే ముసలం పుట్టింది. మరో 15 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ చైతన్యం అత్యధికంగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ శాసనసభ్యుల నుంచే తిరుగుబాటు ప్రారంభమైంది. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం ఒక్కసారిగా యావత్తు రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల తన నియోజకవర్గంలో పింఛన్ల కోతపై బాహాటంగానే విరుచుకుపడ్డారు. ఆ మధ్య సొంత పార్టీకి చెందిన నాయకులే తనను బలహీన పరచడానికి కుట్ర పన్నుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యక్తం చేసిన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) పెద్దలు మాత్రం కోటంరెడ్డిది ధిక్కార స్వరమేనని భావిస్తున్నారు. వారెంత చెప్పినా ఆయన తన పంథా మార్చుకోలేదు.
ఏడాది కిత్రం వరకు ఎమ్మెల్యే అనిల్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు అత్యంత ఆప్తులుగా మెలిగారు. ఒకేమాట, ఒకేబాటగా సాగారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఆదిపత్యపోరు మొదయ్యింది. దీనికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలను కొందరంటే, అధికారుల బదిలీలే కారణమని మరి కొందరు చెబుతున్నారు. కారణాలు ఏవైనా ప్రస్తుతం వీరిద్దరి మధ్య నిశబ్ద యుద్ధం నడుస్తోందనడంలో సందేహం లేదు. ఒకరినొకరు బలహీన పరుచుకోవడానికి పావులు కదుపుతున్నారనే వాదనలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని పలు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాలు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టాయి. ఇది పార్టీలో ముదిరిన వైషమ్యాలను ఎత్తి చూపుతోంది. ఈ పరిణామాలన్నీ జిల్లా వైసీపీ అసమ్మతితో అంటకాగుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Updated Date - 2023-01-29T15:11:41+05:30 IST