ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sharmila: కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై షర్మిల ఫైర్

ABN, First Publish Date - 2023-10-15T18:56:30+05:30

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు.


"కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు. మళ్లీ కొత్త కథ మొదలు పెట్టింరు. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర. ప్రతి మహిళకు నెలకు రూ. 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం. నిరుద్యోగ భృతి అని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ.. ఇప్పుడు రూ. 3 వేలు ఇస్తామంటే నమ్మాలా?. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్. రుణమాఫీపై దొర యూ టర్న్. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదు. బందిపోట్లు సమితి మేనిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు." అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-15T18:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising