MLA Quota MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. పంచుమర్తి అనురాధ విజయం
ABN, First Publish Date - 2023-03-23T18:48:22+05:30
ఉత్కంఠ సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు.
MLA Quota MLC Elections: ఉత్కంఠ సాగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) విజయం సాధించారు. అనురాధ గెలిచి తీరుతారని టీడీపీ నేతలు ముందు నుంచే ధీమాగా చెబుతున్నారు. ఇప్పుడు అదే నిజమైంది. 23 ఓట్లతో అనురాధ విజయం సాధించారు. అభ్యర్థి విజయానికి 22 ఓట్లు కావాలి. కానీ అనురాధకు 23 ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్‌పై టీడీపీ నేతలు గంపెడాశ పెట్టుకుంది. అదే నిజమైంది. సాంకేతికంగా టీడీపీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది. వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది. ఇప్పటికే మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పరాజయం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. అనురాధ గెలుపు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి మండలిలో టీడీపీకి పాతినిధ్యం లేదని అనుకున్న సమయంలో నలుగురు సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది. మరోవైపు క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితిని స్వయంగా చూస్తున్న శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపారన్న చర్చ ప్రారంభమైంది. దీంతో వైసీపీ పెద్దల్లో భయం కనిపిస్తోందని అంటున్నారు. ఈ విజయం రాజకీయంగా ప్రభుత్వానికి పెద్ద దెబ్బేనని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని అధికార పార్టీ భయపడుతోంది.
Updated Date - 2023-03-23T18:50:16+05:30 IST