ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Jagan : జగన్‌కు సుప్రీంకోర్టులో షాక్.. బెయిల్ రద్దుపై సుప్రీం నోటీసులు..

ABN, First Publish Date - 2023-11-24T11:53:06+05:30

ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

ఢిల్లీ : ఏపీ సీఎం జగన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ విచారించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత పదేళ్లుగా జగన్‌ బెయిల్‌‌పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్‌‌లో రఘురామ కోరారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ నిర్వహించింది.

లిఖితపూర్వక వివరాలు అందజేసిన బాలాజీ శ్రీనివాసన్..

సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై వివరాలు లిఖితపూర్వకంగా కోర్టుకు రఘురామ తరుపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్‌ అందించారు. జగన్‌కు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత... దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదే వ్యవహారంలో.. కేసు ట్రయల్‌ను హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని తాము దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌ ఉందని, దానిలో ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు కోర్టుకు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ తెలిపారు. సీబీఐ కేసుల విచారణ తరువాతే ఈడీ కేసుల విచారణ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ కూడా ఇటీవల సుప్రీంకోర్టులో సవాలు చేసిన అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు..

ఈడీ దాఖలు చేసిన పిటీషన్ కూడా జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ముందే పెండింగ్‌లో ఉందని కూడా బాలాజీ శ్రీనివాసన్ ప్రస్తావించారు. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టును కోరారు. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలన్న పిటిషన్‌, ఈడి దాఖలు చేసిన పిటిషన్‌కు బెయిల్‌ రద్దు పిటిషన్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి ధర్మాసనం వాయిదా వేసింది.

జగన్ వర్సెస్ సీబీఐ ఫ్రెండ్లీ మ్యాచ్...

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌ను 2022 అక్టోబరు 28న తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోందని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌‌పై ఉన్న జగన్‌... ట్రయల్ కోర్టు ముందు హాజరుకాకుండా శాశ్వత మినహాయింపు పొందారని పిటిషన్‌లో రఘురామ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభం అయ్యి పదేళ్లయినా.. అభియోగాల నమోదు జరగకపోయినా.. దర్యాప్తు సంస్థ సంతోషంగా మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తోందని పిటిషన్‌లో ఆరోపించారు. ఇవే విషయాలను తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నప్పటికి... పరిగణనలోకి తీసుకోకుండా కొట్టివేసిందని రఘురామ తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సీబీఐ ఇంతవరకూ సుప్రీంకోర్టులో సవాలు చేయలేదని రఘురామ వెల్లడించారు.

రఘురామ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు..

అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉంటూ వస్తున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ దాఖలు తరువాతే ఎంపీ రఘురామను అరెస్ట్ చేసి సీఐడీ కస్టోడియల్ టార్చర్ చేసింది. జగన్ బెయిల్ రద్దుపై సరైన విధంగా సీబీఐ స్పందించలేదు. సీబీఐ రిప్లైతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేర తీవ్రతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును రఘురామ కోరారు. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

Updated Date - 2023-11-24T12:39:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising