ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP : గన్నవరంలో వైసీపీకి షాక్.. పార్టీ మారనున్న కీలక నేత.. అనుచరులతో ఫైనల్ మీటింగ్..

ABN, First Publish Date - 2023-08-18T13:32:20+05:30

గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ కీలక నేత పార్టీ మారే యోచన చేస్తున్నారు. ముఖ్య అనుచరులతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గన్నవరంలో ప్రస్తుత పరిస్థితులను వైసీపీ నేతలుగా జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు.

విజయవాడ : గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీ కీలక నేత పార్టీ మారే యోచన చేస్తున్నారు. ముఖ్య అనుచరులతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తుది విడత చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు నేడు వారితో సమావేశమయ్యారు. కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. గన్నవరంలో ప్రస్తుత పరిస్థితులను వైసీపీ నేతలుగా జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలా? లేక టీడీపీలో చేరాలా? అనే విషయంలో యార్లగడ్డ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ముఖ్య అనుచరుల అభిప్రాయానికి అనుగుణంగా రాజకీయ భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం యార్లగడ్డ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుగా నిలవడంతో నాడు మొదలైన ఈ వివాదం ఇప్పటికీ ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంది. రెండ్రోజులకోసారి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు వర్సెస్ వంశీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. సీఎం వైఎస్ జగన్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఇద్దర్నీ కలిపినప్పటికీ.. ఎన్నికలు దగ్గరపడటంతో టికెట్ విషయంలో మళ్లీ రచ్చ రచ్చ జరుగుతోంది.

Updated Date - 2023-08-18T13:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising