ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Somu Veerraju : మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తొలగిస్తున్నామంటూ సోము వీర్రాజుకు జేపీ నడ్డా సడెన్ షాక్..

ABN, First Publish Date - 2023-07-04T13:40:06+05:30

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా ఇది జరిగిపోయింది. ఇటీవలి కాలంలో మన ఫోకస్ అంతా ఎంతసేపూ తెలంగాణ మీదే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అధిష్టానం నుంచి బండి సంజయ్‌కు కాల్ రావడం.. ఆయన హుటాహుటిన నిన్న హస్తినకు బయలుదేరి వెళ్లడం చకచకా జరిగిపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగించారు. ఏమాత్రం చడీచప్పుడు లేకుండా ఇది జరిగిపోయింది. ఇటీవలి కాలంలో మన ఫోకస్ అంతా ఎంతసేపూ తెలంగాణ మీదే ఉంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అధిష్టానం నుంచి బండి సంజయ్‌కు కాల్ రావడం.. ఆయన హుటాహుటిన నిన్న హస్తినకు బయలుదేరి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. పైగా ఆయనను తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించి దానిని కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డికి కట్టబెడతారంటూ గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు సోము వీర్రాజు తొలగింపుతో ఏపీ చర్చనీయాంశంగా మారింది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజును తొలగిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఆయనకే ఫోన్ చేసి చెప్పి షాక్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. ‘ మీ టర్మ్‌ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి’ అని సూచించారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతా రామరాజు జయంతి కార్యక్రమాన్ని సోము వీర్రాజు నిర్వహించిన కాసేపటికే ఈ షాకింగ్ న్యూస్ ఆయన వినాల్సి వచ్చింది. ఏపీలో ఇటీవలి కాలంలో ఆయనపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. అదీ చాలదన్నట్టు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కూడా కారణం సోమూ వీర్రాజేనన్న టాక్ నడిచింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడి మార్పు ఆవశ్యకమని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-07-04T13:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising