Appalaraju: టీడీపీ ఓట్లపై అప్పలరాజు కీలక వ్యాఖ్యలు.. కార్యకర్తలను ఇంటికి పిలిచి..!
ABN, First Publish Date - 2023-08-04T14:43:18+05:30
ఆయనో మంత్రి. బాధ్యతగా ఉండాల్సిన అమాత్యుడే ప్రత్యర్థుల ఓట్లపై కుస్సు బుస్సులాడారు. ఏకంగా తెలుగుదేశానికి వేసే ఓట్లను తొలగించేలా కృషి చేయాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఆ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
శ్రీకాకుళం: ఆయనో మంత్రి. బాధ్యతగా ఉండాల్సిన అమాత్యుడే ప్రత్యర్థుల ఓట్లపై కుస్సు బుస్సులాడారు. ఏకంగా తెలుగుదేశానికి వేసే ఓట్లను తొలగించేలా కృషి చేయాలని కార్యకర్తలకు హితబోధ చేశారు. ప్రస్తుతం ఆ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం దొంగ ఓట్లపై టీడీపీ నేతలు పోరాటం చేస్తున్నారు. ఎన్నికల అధికారులను కలుస్తూ అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వలంటీర్లను ఉపయోగించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు దేశం నేతలు ఇలా పోరాటం చేస్తుంటే.. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అప్పలరాజు (Appalaraju).. టీడీపీకి వేసే వారి ఓట్లను తొలగించేలా పని చేయాలని వైసీపీ కార్యకర్తలకు సూచించారు. పలాసలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈ విధంగా మంత్రి ఉపన్యాసం చేశారు.
ఎన్నికల సిబ్బంది వచ్చినప్పుడు మన ఓట్లు కావనుకుంటే ఆ ఓట్లపై అభ్యంతరం పెట్టాలని మంత్రి అప్పలరాజు.. కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉండే వారిని గుర్తించాలని.. అలాంటి వారు మనకు ఓట్లు వేయరన్నారు. ఎక్కడో ఉంటారు.. ఎన్నికల్లో మాత్రం ఓట్లు వేస్తారని.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారంతా టీడీపీకే వేస్తారని పేర్కొన్నారు. అలాంటి ఓటర్లను గుర్తించి ఫామ్- 7 రైజ్ చేయాలని మంత్రి సూచించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీలో హాట్ టాఫిక్‌గా మారాయి. అప్పలరాజుపై ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
Updated Date - 2023-08-04T14:45:18+05:30 IST