ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: పేదల ద్రోహి జగన్‌కు.. ఐదు కోట్ల జనానికి మధ్య యుద్ధం

ABN, First Publish Date - 2023-10-09T15:43:18+05:30

అమరావతి: పేదల ద్రోహి జగన్‌కు ఐదు కోట్ల జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు.

అమరావతి: పేదల ద్రోహి జగన్‌ (Jagan)కు ఐదు కోట్ల జనానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, తన అవలక్షణాలు ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్దమే వందసార్లు చెప్పడం జగన్ రెడ్డి నైజమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి కంటికి వైసీపీ ప్రజాప్రతినిధులు (YCP Leaders) కనిపించలేదని, తాడేపల్లి ప్యాలెస్‌లోకి వారికి అనుమతి లేదని, పంచాయతీ నిధులు మళ్లింపును ప్రశ్నించిన వైసీపీ సర్పంచులపై లాఠీ ఛార్జ్ చేయించారని విమర్శించారు.

పేదలపై జగన్ రెడ్డి పేదల పేరుతో కొంగ జపం చేస్తూ కపట ప్రేమ చూపుతున్నారని, పేదలపై ప్రేమ నిజమైతే పేదల కోసం చంద్రన్న పెట్టిన 120 పథకాలు ఎందుకు రద్దు చేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మైనార్టీల (Minorities) సబ్ ప్లాన్ (Sub Plan) నిధులు రూ.1.14 లక్షల కోట్లను ఎందుకు మళ్లించారన్నారు. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ద పదవుల దూరం ఉద్దరించడమా?.. విదేశీ విద్య, స్టడీ సర్కిల్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు పేదలపై ప్రేమతో చేశారా? అని నిలదీశారు. లక్ష బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా బడుగు బలహీన వర్గాలకు దగా చేసింది నిజం కాదా?... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పారిశ్రామిక రాయితీలు దూరం వాస్తవం కాదా?.. సలహాదారులు, వైస్ ఛాన్సులర్లు, టీటీడీ, ఏపీఐఐసీ లాంటి ఉన్నత పదవుల్లో బడుగులు ఎక్కడని ప్రశ్నించారు.

నాసి రకమైన మద్యంతో 20 వేల మంది పేదల ప్రాణాలు తీశారని, ఉచిత ఇసుక రద్దు చేసి 125 కుల వృత్తులు వ్యాపారాలను దెబ్బతీశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల కడుపుకొట్టారన్నారు. పెళ్లి కానుకలు, సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ కానుకలు రద్దు చేశారని, నిరుద్యోగ భృతి రద్దు చేసి పేద యువతకు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 18.21శాతం ఖర్చు చేస్తే 2022-23లో జగన్ ఖర్చు 16.20 శాతం మాత్రమేనని, జగన్‌రెడ్డి రూ.7 లక్షల కోట్లు అప్పు, పన్నులు, ఛార్జీల బాదుడు వాస్తవం కాదా? అని నిలదీశారు.

టీడీపీ సంక్షేమం పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టిందని, జగన్ రెడ్డి పేదల్ని బిచ్చగాళ్లని చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘వైనాట్ 175 కాదు. వై నాట్ పులివెందుల’ అని ప్రజలు అంటున్నారని, ఈసారి ఎన్నికల్లో జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సొంత పార్టీ నేత డిఎల్ రవీంద్రారెడ్డి చెబుతున్నారన్నారు. జగన్ రెడ్డిని భరించలేమని రాష్ట్రంలోని పేదలంతా నినదిస్తున్నారని, ల్యాండ్-శాండ్-వైన్-మైన్ మాఫియాలకే జగన్ రెడ్డి కావాలి కానీ పేదలకు కాదన్నారు. జగన్ రెడ్డిని మించిన పెత్తందారు.. పేదల ద్రోహి ఎవరూ లేరని పేదలు గుర్తించారని, సీఎం జగన్ లక్షల కోట్ల దోపిడీపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు క్లాస్ వార్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-09T15:43:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising