Chandrababu: చంద్రబాబు వద్ద శ్రీకాళహస్తి టీడీపీ పంచాయతీ.. లైన్ క్లియర్
ABN, First Publish Date - 2023-06-19T16:15:48+05:30
మాజీ సీఎం చంద్రబాబు వద్దకు శ్రీకాళహస్తి టీడీపీ పంచాయతీ చేరింది. చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు భేటీ అయ్యారు. ఇటీవల నాయుడు టీడీపీలో చేరికపై బొజ్జల అభ్యంతరం తెలిపారు. అయితే ఈ సమావేశంతో నాయుడు చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించాలని నాయుడుకు చంద్రబాబు సూచించారు. వచ్చే వారం ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నారు.
శ్రీకాళహస్తి: మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) వద్దకు శ్రీకాళహస్తి (Srikalahasti) టీడీపీ పంచాయతీ చేరింది. చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు (SCV Naidu) భేటీ అయ్యారు. ఇటీవల నాయుడు టీడీపీలో చేరికపై బొజ్జల అభ్యంతరం తెలిపారు. అయితే ఈ సమావేశంతో నాయుడు చేరికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudhir Reddy)కి సహకరించాలని నాయుడుకు చంద్రబాబు సూచించారు. వచ్చే వారం ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరనున్నారు. ఇటీవల చంద్రబాబుతో నాయుడు భేటీ అయ్యారు. తనకు సముచిత స్థానం కల్పిస్తే పార్టీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తానని ప్రతిపాదించినట్టు సమాచారం. తొలుత పార్టీలో చేరి కష్టపడి పనిచేయాలని, దానికనుగుణంగా ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఈ నేపధ్యంలో వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్న ఆయన.. నెలలోపు టీడీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. తొలుత టీడీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఎస్సీవీ నాయుడు.. పార్టీని వీడాక 2004లో కాంగ్రెస్ తరపున శ్రీకాళహస్తి నుంచీ పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల సమయంలో తిరిగి టీడీపీలో చేరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే నాలుగేళ్ళుగా అధికార పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నట్టు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2023-06-19T16:18:52+05:30 IST