ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy : అవినాశ్‌ ముందస్తు బెయిల్ రద్దుపై సునీత పిటిషన్‌ విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2023-06-08T11:35:00+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు నేడు సునీత తరపు సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూధ్రా ప్రస్తావించారు. ఈ మేరకు సునీత పిటిషన్‌ను రేపు మెన్షన్ చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన అవినాశ్ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత కోరారు.

అవినాశ్‌కు గత నెల 31న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సునీత సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అవినాశ్‌పై మోపిన అభియోగాలన్నీ చాలా కీలకమైనవని పిటీషన్‌లో సునీత పేర్కొన్నారు. సీబీఐ మోపిన అభియోగాలను హైకోర్టు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. హైకోర్టు తీర్పులో కొన్ని లోపాలున్నాయని కూడా సునీత తెలిపారు. అవినాశ్ ముందస్తు బెయిల్‌ను సీబీఐ సైతం వ్యతిరేకిస్తోందని పిటిషన్‌లో వెల్లడించారు. సునీత పిటీషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో సీబీఐ సైతం వాదనలు వినిపించనుంది.

Updated Date - 2023-06-08T11:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising