ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి హాజరుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ, వైసీపీ

ABN, First Publish Date - 2023-05-24T13:28:31+05:30

దేశ రాజధానిలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు 19 పార్టీలు ప్రకటించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : దేశ రాజధానిలో ఈనెల 28న జరుగనున్న కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ (New Parliament Building Inaugaration) కార్యక్రమాన్ని బహిష్కరించనున్నట్టు 19 పార్టీలు ప్రకటించాయి. కానీ ఏపీలో మాత్రం అధికార, విపక్ష పార్టీలు వైసీపీ (YCP), టీడీపీ (TDP)లు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలిపాయి. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రధాని మోదీ మే 28న పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు.

రాష్ట్రీయ జనతా దళ్ (RJD), డీఎంకే (DMK), శివసేన (UBT), ఎన్‌సీపీ (NCP) బుధవారం నాడు ప్రకటించాయి. టీఎంసీ, సీపీఐ, ఆప్ ఇప్పటికే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. కాంగ్రెస్ సహా మరిన్ని విపక్ష పార్టీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా 19 విపక్ష పార్టీలు పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం లేదని తెలియజేస్తూ లేఖను విడుదల చేశాయి.

పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటూ విపక్షాలు బలంగా డిమాండ్ చేస్తుండగా, ఈ అంశంపై భావసారూప్యం కలిగిన విపక్ష పార్టీలన్నీ చర్చించి ఆ పార్టీల ఫ్లోర్ లీడర్లు సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఆర్జేడీ నేత మనోజ్ ఝా మాట్లాడుతూ, పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి ప్రారంభించనుండటం రాజ్యాంగ విరుద్ధమని, ప్రారంభోత్సవాన్ని బాయ్‌కాట్ చేయడం ద్వారా విపక్షాలు ఐక్య సందేశం ఇవ్వనున్నాయని చెప్పారు.

Updated Date - 2023-05-24T15:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising