ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: దొంగ ఓటర్లను పట్టుకున్న టీడీపీ

ABN, First Publish Date - 2023-03-13T19:52:40+05:30

మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా (Chittoor District) పుంగనూరులో దొంగ ఓట్లను వేసేందుకు ప్రయత్నించగా టీడీపీ,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా (Chittoor District) పుంగనూరులో దొంగ ఓట్లను వేసేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. చౌడేపల్లెలో ఓ వలంటీరు భర్త శ్రీనివాసులు అందరి కళ్లు కప్పి దొంగ ఓటు వేసి, బయటికి వచ్చేటప్పుడు టీడీపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చౌడేపల్లెలో సుమారు 200 దొంగ ఓట్లను వేశారని స్థానిక టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పుంగనూరు పోలింగ్‌ కేంద్రంలో ముగ్గురు వైసీపీ మున్సిపల్‌ కౌన్సిలర్లు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చోవడంతో టీడీపీ జనరల్‌ ఏజెంట్‌ అడ్డుకుని బయటికి పంపించేశారు. ఈ విషయంగా టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి (Challa Ramachandra Reddy) అధికారులకు ఫిర్యాదు చేశారు. పుంగనూరులో దొంగ ఓట్లను వేసేందుకు వచ్చినవారిని పోలింగ్‌ కేంద్రంలోని టీడీపీ ఏజెంట్లు (TDP Agents) గుర్తించి వెనక్కి పంపేశారు. చిత్తూరు పీసీఆర్‌ కాలేజీలోని పోలింగ్‌ కేంద్రంలో వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు అడ్డుకున్నారు. అలాగే నగరిలోనూ వైసీపీ ప్రచారాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పలమనేరులోనూ వైసీపీ ప్రచారాన్ని టీడీపీ అడ్డుకుంది. కుప్పంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెరచి ఉంచడంతో మణి, మంజు అనే ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి గొడవ పడ్డారు. ఇద్దరికీ గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

ఎలక్షన్ హైలెట్స్

రామకుప్పంలోని పోలింగ్‌ బూత్‌లోకి వైసీపీ కార్యకర్త శ్రీవర్ధన్‌ సెల్‌ఫోను తీసుకెళ్లి తాను ఓటు వేస్తున్న ఫొటోను బ్యాలెట్‌ పేపర్‌ సహా తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. ఇది వైరల్‌ కావడంతో జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లాలో పోలింగ్‌ శాతం భారీగా నమోదైంది. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ఏకంగా 89.07 శాతం ఓట్లు పోల్‌ కాగా, గ్రాడ్యుయేట్స్‌ స్థానానికి 79.48 శాతం ఓట్లు పోలయ్యాయి. మంత్రి పెద్దిరెడ్డి సదుంలో, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పుంగనూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం డీఐజీ రవిప్రకాష్‌, కలెక్టర్‌ హరినారాయణన్‌, ఎస్పీ రిషాంత్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్‌ తదితర అధికారులు ఆయా పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - 2023-03-13T19:52:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising