AP MLC Results: టీడీపీ సంబరాలు
ABN, First Publish Date - 2023-03-17T20:47:37+05:30
విజయనగరం (Vizianagaram)లో సంబరాలు మిన్నంటాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) టీడీపీ బలపరచిన వేపాడ
విజయనగరం: విజయనగరం (Vizianagaram)లో సంబరాలు మిన్నంటాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) టీడీపీ బలపరచిన వేపాడ చిరంజీవిరావు (Chiranjeevi Rao) ఆధిక్యత కనబరచడంతో టీడీపీ (TDP) శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ప్రతీ రౌండ్‌లో చిరంజీవిరావు ఆధిక్యత కనబరచడంతో టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాయంత్రానికి అశోక్ బంగ్లా ప్రాంగణంలో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చాయి. మిఠాయిలు పంచుకున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు డ్యాన్స్‌లతో హోరెత్తించారు. టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్‌గజపతిరాజు (Ashok Gajapathi Raju) మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడ్డాయన్నారు. ప్రజాస్వామ్యం ఖునీ అవుతున్న తరుణంలో పట్టభద్రులు విలక్షణమైన తీర్పునిచ్చారని అభినందించారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని.. ఇప్పుడు సీఎం జగన్ ఏం చేయబోతున్నారన్నదానిపై మంత్రుల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పారు.
నందిగామలో టీడీపీ సంబరాలు
నందిగామలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో టీడీపీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పతనం ప్రారంభమైందని, పులివెందులలోనే టీడీపీ మెజార్టీ వచ్చిందని తంగిరాల సౌమ్య అన్నారు.
చిరంజీవిరావు ఆధిక్యం
ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ (YCP) బొక్క బోర్లా పడింది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 2,89,214 మంది ఓటర్లకు గాను 2,00,926 మంది (69.47 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లను మొత్తం ఎనిమిది రౌండ్లుగా విభజించి గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రారంభించారు. అయితే మొదటి నుంచి చివరి వరకూ ప్రతి రౌండ్‌లోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావు ఆధిక్యం సాధించారు.
Updated Date - 2023-03-17T20:47:37+05:30 IST