ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : పెద్దిరెడ్డీ ఖబడ్దార్‌.. పుంగనూరులో ఎలా గెలుస్తావో నేను చూస్తా!

ABN, First Publish Date - 2023-08-04T22:24:07+05:30

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు..

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Minister Peddireddy) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) కన్నెర్రజేశారు.! అంగళ్లు, పుంగనూరు జరిగిన పరిణామాల నేపథ్యంలో అక్కడ్నుంచి పూతలపట్టుకు వచ్చిన చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి ఇవే చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. ‘పుంగనూరులో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తాడో నేను చూస్తా. సొంత జిల్లాలోనే నన్ను అడ్డుకుందామని చూస్తారా?. పెద్దిరెడ్డి ఖబడ్దార్‌.. జాగ్రత్తగా ఉండు. వైసీపీ నేతల కింద భూమి కంపిస్తోంది. అందుకే నా పర్యటనకు అడ్డు తగులుతున్నారు. నాపై దాడికి యత్నించి.. చిత్తూరు జిల్లా బంద్‌కు పిలుపునిస్తారా?. జిల్లా ఎస్పీ పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తాడా?. నా పర్యటనను అడ్డుకునే వారిని పంపించే బాధ్యత లేదా?. ఎస్పీ నాపై దాడి చేయించాలని అనుకుంటున్నారా?. ఎన్‌ఎస్జీ భద్రత లేకుంటే నాపైన కూడా గొడ్డలి వేటు వేసేవారేమో?. నన్ను కట్టడి చేయటం ఈ సైకోల వల్ల కాదు.


ఇంత దారుణమా..?

మరోవైపు.. పుంగనూరు ఘటనను ప్రతిపక్ష పార్టీల నేతలు, మేథావులు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎందుకింత దారుణాలకు ఒడిగడుతోందని రాష్ట్ర ప్రజానీకం కూడా మండిపడుతోంది. ‘పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు పండే రోజు ద‌గ్గరపడింది. జెడ్ప్లస్‌ భద్రతలో ఉన్న చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దాడుల‌ు చేయించావంటే.. ఎంత అభద్రతలో ఉన్నావో అర్థమవుతోంది. వైసీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం.. రాజారెడ్డి రాజ్యాంగ‌మే. టీడీపీ సభపైకి వ‌చ్చి వైసీపీ అల్లరి మూకలు రాళ్లు రువ్వుతుంటే పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేయడం సిగ్గుచేటు. పుంగ‌నూరులో ప్రజాస్వామ్యంపై వైసీపీ చేసిన దాడి ఇది’ అని యువనేత నారా లోకేశ్‌ మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదన్నారు. వైసీపీ తీరు ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందని.. ప్రతిపక్షం గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అరాచకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజల తరపున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యతని పవన్‌కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

AP Politics : ఏపీలో అసలేం జరుగుతోంది.. చంద్రబాబు, లోకేష్‌ల సెక్యూరిటీపై కేంద్రం ఆరా..!


Updated Date - 2023-08-04T22:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising