ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Vs YSRCP : జగన్ సర్కార్‌కు మూడ్రోజులు డెడ్‌లైన్ పెట్టిన చంద్రబాబు..

ABN, First Publish Date - 2023-05-05T22:39:38+05:30

విధ్వంస పాలనతో వైఎస్ జగన్ రైతులన్ని నట్టేట ముంచారని ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను చూసి చంద్రబాబు చలించిపోయారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధ్వంస పాలనతో వైఎస్ జగన్ రైతులన్ని నట్టేట ముంచారని ప్రభుత్వంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నలను చూసి చంద్రబాబు చలించిపోయారు. ప్రస్తుతం బాబు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పంట నష్టం పరిశీలించిన చంద్రబాబు.. జగన్ సర్కార్‌పై (Jagan Govt) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘పంటలు దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంభోక్షం వస్తే సీఎం ప్రజలకు భరోసా కల్పించాలి. సీఎం, మంత్రులు సహా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. విధ్వంస పాలనతో రైతుల్ని నట్టేట ముంచారు. రైతులకు బీమా కట్టలేదు.. ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి. నూకల వంకతో ధరలో కోత పెట్టడం దారుణం. కొనుగోళ్లలో కోత పెట్టకుండా డబ్బులు చెల్లించాలి. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏప్రిల్‌-01 నుంచి ధాన్యం ఎందుకు సేకరించడం లేదు?. కళ్ళాల్లో ఉన్న ధాన్యం మొలకలు వచ్చాయి. శనివారం నాడు కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో తిరుగుతాను. 45 శాతం పొలాల్లో ఉన్న పంటకు నష్టపరిహారం ఇవ్వాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఇదిగో డెడ్‌లైన్..!

సీఎంఆర్ అనే పేరు పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి చిన్నాభిన్నం చేశారు. ఆన్‌లైన్‌లో తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు. 150 నుంచి 300 రూపాయలు బస్తాకు నష్టం వస్తోంది. ఇందులో ప్రభుత్వమే దోషి. 75 నుంచి 80 శాతం కౌలు రైతులు ఉన్నారు. అధికారులు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. ముఖ్యమంత్రికీ భాద్యత లేదా..?. పొలంలో ఉన్న పంట కు నష్టపరిహారం ఎంత ఇస్తారో చెప్పాలి. నూకలు పేరుతో బస్తాకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, వాణిజ్య పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు మీరు ఏం చేస్తారో.. ఈరోజు నుంచి మూడు రోజుల గడువు ఇస్తున్నాం. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం. ఈ నెల 9న తహసిల్థార్ కార్యాలయాలు వద్ద.. 11న కలెక్టరేట్‌ల వద్ద నిరసన చేపడతాం. 13న నిరసన దీక్ష చేస్తాం. నిరసన దీక్షలో పాల్గొంటాం. కౌలు రైతుల కోసం బటన్ నొక్కి జగన్ నిజాయితీ నిరూపించుకోవాలి. పంట అంతా వీడియో తీయండి. ఆరు నెలల తర్వాత అధికారంలోకి వచ్చాక ఆదుకుంటాం. రైస్ మిల్లర్లతో అధికారులు లాలూచీ పడ్డారు.. ఇది అనాగరికం. మా పంట మునిగింది.. పరిహారం ఇవ్వండి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం అని జగన్ సర్కార్‌కు చంద్రబాబు డెడ్ లైన్ విధించారు.

Updated Date - 2023-05-05T22:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising