ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2023-12-04T12:51:42+05:30

Cyclone Michaung: మిచాంగ్ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు.

అమరావతి: ‘‘మిచాంగ్’’ తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మిచాంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందన్నారు. తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా... ప్రభుత్వం తగు రీతిలో స్పందించ లేదన్నారు. ధాన్యం కోనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.


సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలన్నారు. తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని.. బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-12-04T12:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising