Chandrababu Bail: రాజమండ్రి టు విజయవాడకు చంద్రబాబు రూట్ మ్యాప్ ఇదే..
ABN, First Publish Date - 2023-10-31T12:53:44+05:30
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) ఏపీ హైకోర్టు (AP Highcourt) బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు (TDP Chief) జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు (TDP) సిద్ధమవుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ ఊరేగింపుతో చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు. విజయవాడ నుంచి తిరుపతికి టీడీపీ అధినేత చేరుకుంటారు. రాజమండ్రి నుంచి విజయవాడకు చంద్రబాబు వెళ్లే రూట్ మ్యాప్‌ను టీడీపీ సిద్ధం చేసింది. దీనిపై చర్చించేందుకు రాజమండ్రి క్యాంపు సైట్‌లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో (TDP Leader Nara Lokesh)టీడీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
రూట్ మ్యాప్ వివరాలు..
రాజమండ్రి నుంచి వేమగిరి(రాజమండ్రి, అనపర్తి), రావులపాలెం(కొత్తపేట, మండపేట), పెరవలి(నిడదవోలు), తణుకు(తణుకు, ఆచంట), తాడేపల్లిగూడెం(తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలం గోపాలపురం), భీమడోలు(ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలం(గోపాలపురం)), దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్(గన్నవరం, నూజివీడు, గుడివాడ), గన్నవరం మీదుగా విజయవాడకు చంద్రబాబు వెళ్లనున్నారు.
Updated Date - 2023-10-31T12:54:15+05:30 IST