ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ.. బెంగళూరు సభా వేదికగా చంద్రబాబు పిలుపు

ABN, Publish Date - Dec 28 , 2023 | 01:41 PM

Andhrapradesh: బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

బెంగళూరు, డిసెంబర్ 28: బెంగళూరులో ప్రభావితం చేసే స్థాయిలో తెలుగు ప్రజలు ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. గురువారం బెంగళూరులో టీడీపీ ఫోరం (Bangalore TDP Forum Meeting) ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. వేలాది మంది తెలుగు ప్రజలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ మాట్లాడుతూ..తనకు కష్టం వచ్చినప్పుడు అంతా అండగా నిలబడ్డారన్నారు. రైతు బిడ్డ ఐటీలో ఎందుకు పనిచేయకూడదు అని ఆలోచన చేశానని.. 30 సంవత్సరాల క్రితం చేసిన ఆలోచనతో ఈ రోజు ఇంత మంది ఐటీ ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు. ఐటీని డెవలప్ చేయాలంటే ఆ రోజు ఎగతాళి చేశారన్నారు. థింక్ గ్లోబలీ... యాక్ట్ గ్లోబలీ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గ్లోబలీ పనిచేసే అవకాశం ఉందన్నారు.


పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి..

ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే అవకాశం భారత దేశానికే ఉందన్నారు. 2047 సంవత్సరానికి భారత దేశం నెంబర్ వన్‌గా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను కూడా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. నవశఖం తెలుగువారి శఖం అవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా తెలుగు ప్రజలు ఉండాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరంను చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేస్తున్నారన్నారు. ఆడపిల్లకు చదువెందుకు అని అన్నారని... ఇప్పుడు ఆడపిల్లలు మగవారితో సమానంగా ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదరికం లేని సమాజంను చూడాలన్నదే తన కోరికన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించాలని దే లక్ష్యమని స్పష్టం చేశారు. పీ4 వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని.. పీ4 అంటే పబ్లిక్ ప్రయివేట్ పీపుల్ పార్టనర్ షిప్ అని టీడీపీ చీఫ్ చెప్పుకొచ్చారు.

బెంగళూరు టీడీపీ ఫోరంను కోరుతున్నా...

‘‘ఆంధ్రప్రదేశ్‌ని బాగు చేసేందుకు మీరు ఏం చేయగలరు ప్లాన్ చేయండి. వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. వచ్చే ఎన్నికలు ఎందుకు ముఖ్యమో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. ఎన్నికల ప్రచారంలో కూడా మీరు పాల్గొనాలి. మీరు సంపాదించే దానిలో 5 శాతం ఖర్చుపెట్టి సమాజం కోసం ఖర్చు చేయండి. సమాజహితం కోసం మీరు కష్టపడాలి. నాకోసం కాదు నేను చేసే పనులు తర తరాలు గుర్తుపెట్టుకోవాలి. చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే నా జన్మ దన్యమైనట్లే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. బెంగళూరులో సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు కుప్పంకు బయలుదేరి వెళ్లారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 28 , 2023 | 02:14 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising