ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Elections: విశాఖలో వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-03-13T21:11:43+05:30

ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) సోమవారం ఎన్నికల కోడ్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) సోమవారం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థానికేతరుడైన ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC Elections) సందర్భంగా నగరంలో ఉండడం, పైగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లడం వివాదాస్పదమైంది. కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) నిబంధనల ప్రకారం ఉత్తరాంధ్రలో ఓటరు కాని, పౌరుడు కాని నాయకులు పోలింగ్‌ సమయానికి 48 గంటల ముందుగా ఈ ప్రాంతం విడిచివెళ్లిపోవాలి. కానీ సుబ్బారెడ్డి మాత్రం గత వారం రోజులుగా నగరంలోనే తిష్ఠ వేయడంతోపాటు సోమవారం పార్టీ నేతలతో కలిసి అక్కయ్యపాలెంలోని ఎన్‌జీజీవో కాలనీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రం వద్దకు వెళ్లారు.

సుబ్బారెడ్డిపై టీడీపీ ఫిర్యాదు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి వైసీపీ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పోలింగ్‌ బూత్‌లకు వెళ్లడంపై తెలుగుదేశం విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎన్నికల జనరల్‌ ఏజెంట్‌ పీఎస్‌ నాయుడు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాకు, స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-03-13T21:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising