ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌‌ను ప్రారంభించిన టీడీపీ

ABN, First Publish Date - 2023-10-10T14:32:16+05:30

వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయినింగ్‌కు కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను టీడీపీ ప్రారంభించింది. ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను మొదలుపెట్టారు.

అమరావతి: వై ఏపీ నీడ్స్‌ జగన్‌ క్యాంపెయినింగ్‌కు కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను టీడీపీ ప్రారంభించింది. ఏపీ హేట్స్‌ జగన్‌ పేరుతో కౌంటర్‌ క్యాంపెయిన్‌‌ను మొదలుపెట్టారు. జగన్ను (AP CM Jagan) ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయించింది. సోషల్‌ మీడియాలో కూడా ఏపీ హేట్స్‌ జగన్‌ అనే హ్యాష్‌ ట్యాగుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంస్‌పై తెలుగుదేశం ప్రచారం చేపట్టనుంది.


ఈ సందర్భంగా బోండా ఉమా (TDP Leader Bonda Uma) మాట్లాడుతూ... ఏపీ నీడ్స్‌ జగన్‌ కాదు.. ఏపీ హేట్స్‌ జగన్‌ అని అన్నారు. వద్దు బాబోయ్‌ జగన్‌ అని ప్రజలు అంటున్నారన్నారు. వైసీపీ ప్రతినిధుల సభలో జగన్‌ మాట్లాడిన ప్రతిదీ పచ్చి అబద్దమన్నారు. ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేసిన జగన్‌.. మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. నవరత్నాల్లో ఏ రత్నమైనా నూటికి 10-15 మందికి మాత్రమే దక్కాయన్నారు. రూ. 10 లక్షల కోట్ల మేర తెచ్చిన అప్పులేమయ్యాయని ప్రశ్నించారు.రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను డీబీటీల రూపంలో ఇచ్చానని చెబుతున్నారని.. మిగిలిన రూ. 7 లక్షల కోట్లపై నిధులేమయ్యాయని నిలదీశారు. రూ.7 లక్షల కోట్ల నిధులు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నారు. వైద్య, విద్య రంగాలను జగన్‌ సర్వనాశనం చేశారని విమర్శించారు. అన్ని నాశనం చేసిన జగన్‌ ఇంకెందుకని అడుగుతున్నారన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ప్రజలు అడ్డుకుంటున్నారని.. బస్సు యాత్ర చేస్తున్నారా అని అడిగారు. దళితుడ్ని చంపిన అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్న జగన్‌.. దళిత పక్షపాతా అంటూ బోండా ఉమా ప్రశ్నించారు.

Updated Date - 2023-10-10T14:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising