ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: దగా చేస్తూ.. ఉద్దరిస్తున్నానని చెప్పుకోవడానికి జగన్ సిగ్గుపడాలి

ABN, First Publish Date - 2023-09-29T14:05:07+05:30

వాహన మిత్రతో ఇచ్చేది రూ.10 వేలు.. కొట్టేస్తున్నది రూ.లక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షలు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి నవమోసాలు చేశారన్నారు. చంద్రబాబు సంక్షేమానికి ఏటా బడ్జెట్లో 18.21% ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి పాలనలో సంక్షేమానికి ఖర్చు 16.20% మాత్రమే అని చెప్పుకొచ్చారు.

అమరావతి: వాహన మిత్రతో ఇచ్చేది రూ.10 వేలు.. కొట్టేస్తున్నది రూ.లక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షలు కింజరాపు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాల పేరుతో జగన్ రెడ్డి (CM Jagan) నవమోసాలు చేశారన్నారు. చంద్రబాబు సంక్షేమానికి ఏటా బడ్జెట్లో 18.21% ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి పాలనలో సంక్షేమానికి ఖర్చు 16.20% మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పెరిగినా సంక్షేమం బడ్జెట్ ఎందుకు తగ్గుతోందని నిలదీశారు. అప్పులు, పన్నులు, ఆదాయం పెరిగినా సంక్షేమ ఖర్చు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టేలా చంద్రబాబు సంక్షేమం ఉంటే.. పేదల్ని బిచ్చగాళ్లని చేసేలా జగన్ రెడ్డి బటన్ నొక్కుడు ఉందని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డ్రైవర్లకు ఇన్నోవా కారు ఇచ్చి యజమానిని చేశారని.. జగన్ రెడ్డి 10% మంది డ్రైవర్లకు ఏటా రూ.10వేలు ఇచ్చి ధరలు, పన్నులు, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారని మండిపడ్డారు. రైతు భరోసాతో రూ.7,500 ఇస్తూ రుణమాఫీ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలు రద్దు చేశారన్నారు. అమ్మఒడితో రూ.13వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారని ఆయన విమర్శించారు.


ఎమ్‌టీఎఫ్, ఆర్టీఎఫ్ స్కాలర్ షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పథకాలను రద్దు చేశారన్నారు. చంద్రబాబు రూ.1800 పెంచితే జగన్ రెడ్డి పెంచింది రూ.750 మాత్రమే అని అన్నారు. రూ.3 వేల పెన్షన్ హామీపై, ఏటా రూ.250 పెంపుపైనా మాట తప్పి మోసం చేస్తున్నారన్నారు. సెంటు పట్టా పేరుతో పేదల్ని అప్పుల పాలు చేశారన్నారు. భూమి కొనుగోలులో వైసీపీ నేతలు రూ.7వేల కోట్లు మింగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే జగన్ రెడ్డి ఇస్తున్నది 10 లక్షల మందికే అని అన్నారు. మద్య నిషేధం హామీని నిషేధించి, మద్యంపై అప్పులు తెచ్చి తినేస్తున్నారన్నారు. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చి కమిషన్ల కోసం రాష్ట్రాన్ని ఎడారి చేస్తున్నారని అన్నారు. బిల్లుల పెండింగుతో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారన్నారు. ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ హామీకి తిలోదకాలిచ్చి మోసం చేశారన్నారు. చంద్రన్న అమలు చేసిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారని.. దగా చేస్తూ.. ఉద్దరిస్తున్నానని చెప్పుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి అంటూ అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-09-29T14:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising