ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devineni Uma: దిగ్విజయంగా ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ బస్సు యాత్ర

ABN, First Publish Date - 2023-07-04T12:55:45+05:30

భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: ‘‘భవిష్యత్‌కు గ్యారంటీ’’ బస్సు యాత్రలో భాగంగా మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరులో జరిగే బహిరంగ సభ ప్రదేశాన్ని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (TDP Leader Devineni Uma) పరిశీలించారు. ఈ సందర్భంగా బస్సు యాత్రను జయప్రదం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్ర దిగ్విజయంగా జరుగుతోందన్నారు. 7, 8 తేదీల్లో తిరువూరు, మైలవరం నియోజకవర్గాలల్లో భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్ర ఉంటుందన్నారు. బస్సు యాత్రలో భాగంగా చింతలపూడి ప్రాజెక్ట్ (Chintapudi Project) సందర్శన ఉంటుందని తెలిపారు. చింతలపూడికి రూ.5 వేల కోట్లు తెచ్చి, నాలుగు కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. చింతలపూడిని వైసీపీ ప్రభుత్వం (YCP Government) గాలికి వదిలేసిందని విమర్శించారు. చింతలపూడి ప్రాజెక్ట్ ప్రాముఖ్యత వైసీపీ ప్రభుత్వానికి తెలియదన్నారు. చింతలపూడి నిర్మాణం కోసం ఉంచిన మెటీరియల్‌ను దొంగలు ఎత్తుకుపోయారన్నారు. భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్రలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నాయకులు పాల్గొంటారని.. బస్సు యాత్రను టీడీపీ శ్రేణులు విజయవంతం చేయాలని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారంటీలో భాగంగా మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ అమలు చేయబోయే పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలని దేవినేని ఉమా సూచించారు.

Updated Date - 2023-07-04T12:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising