Devineni Uma: అలాంటి వాడికి పరువు ఉంటుందా?
ABN, First Publish Date - 2023-08-24T10:20:40+05:30
గన్నవరం బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అమరావతి: గన్నవరం బహిరంగ సభ వేదికపై ముఖ్యమంత్రి, మంత్రి ఆర్.కె.రోజాల పరువు తీసారంటూ టీడీపీ నేతలు లోకేశ్, కొనకళ్ల నారాయణకు నోటీసులు ఇవ్వడంపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister Devineni Umamaheshwar rao) మాట్లాడుతూ... తల్లిని - చెల్లిని గెంటేసి, బాబాయ్‌ని హత్య చేయించిన వాడికి పరువు అంటూ ఉంటుందా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా వైసీపీ నేతలు (YCP Leaders) దోచుకున్న డబ్బు కాపాడుకోవటానికి ముఖ్యమంత్రి బూట్లు నాకుతున్నారని విమర్శించారు. నేతల ప్రతీ బూతు మాటకి ఓట్ల రూపంలో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. యువగళంతో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. యువగళంతో వైసీపీ భోషాణాలు బద్దలు కాబోతున్నాయంటూ వ్యాఖ్యలు చేశారు. మల్లవల్లిలో అశోక్ లై ల్యాoడ్ ఏమైందో మంత్రులు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. అర్ధరాత్రులు కూడా ప్రజల మధ్య లోకేశ్ ధైర్యంగా నడుస్తున్నారని.. వైసీపీ నేతల్లా గుడిసెల్లో దూరట్లేదంటూ కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-08-24T10:58:32+05:30 IST