ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pattabhi: సీమెన్స్‌కి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం

ABN, First Publish Date - 2023-09-12T15:32:07+05:30

టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్‌తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు.

అమరావతి: టెండర్లు పిలవకుండా సీమెన్స్ వారికి రూ.371 కోట్లు అప్పనంగా కట్టబెట్టారని వైసీపీ (YCP) దుష్ఫ్రచారం చేస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (TDP Leader Kommareddy Pattabhiram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చే బైజూస్‌తో టెండర్లు పిలవకుండా ఎలా ఒప్పందం చేసుకుందని ప్రశ్నించారు. వందల కోట్లు వెచ్చించి పిల్లలకు టాబ్‌లు కొనుగోలు చేసి అందులో బైజూస్ సాప్ట్‌వేర్‌ను వాడినప్పుడు టెండర్లు ఎందుకు పిలవలేదని నిలదీశారు. బైజూస్ వారు తమ సాప్ట్‌వేర్‌ను ఇచ్చేందుకు ఎంతో పెద్దమనసుతో వచ్చారని జగన్‌రెడ్డి నాడు మాట్లాడలేదా అని అడిగారు. సీమెన్స్ కోట్ల విలువ చేసే తమ సాప్ట్‌వేర్‌ను ప్రపంచ వ్యాప్తంగా అనేక విద్యాసంస్థలకు, విశ్వవిద్యాలయాలకు ఇచ్చారన్నారు. ఉచితంగా గ్రాంటు రూపంలో ఇచ్చే సహాయానికి కూడా టెండర్ పిలవలేదని ఆరోపించడం సైకోయిజం కాక మరేమిటి అంటూ ఆయన మండిపడ్డారు.


సీమెన్స్ సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యువత లబ్దిపొందిన ప్రాజెక్టును రాష్ట్రంలో ఉండకూడని సైకో జగన్‌రెడ్డి కుట్రపన్నారని ఆరోపించారు. ఏపీ కంటే ముందే 2013లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీమెన్స్‌తో ఒప్పందం చేసుకోలేదా అని గుర్తుచేశారు. నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఇనిషియేటివ్‌గా సీమెన్స్ లాంటి ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా రావాలని నాడు మోడీ చెప్పారన్నారు. గుజరాత్, మంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కర్నాటక, తెలంగాణలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్, సిన్సినాటి స్టేట్ టెక్నికల్ అండ్ కమ్యునిటీ కాలేజ్‌, వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ, సదరన్ వర్జీనియా హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్లకు సీమెన్స్ వారు తమ సాప్ట్‌వేర్‌ను ఇన్ గ్రాంటు రూపంలోనే ఇచ్చిందని అన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ తమ సాప్ట్‌వేర్‌ను ఇన్ గ్రాంట్ రూపంలో ఇచ్చారని.. అటువంటి అద్భుతమైన ప్రాజెక్టును రాజకీయ కక్షలకు ఉపయోగించి సర్వనాశం చేశాడు సైకోరెడ్డి అంటూ కొమ్మారెడ్డి పట్టాభి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-12T15:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising