ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh letter: ముస్లిం మైనార్టీలపై దాడులు అరికట్టాలి... గవర్నర్‌కు లోకేష్ లేఖ

ABN, First Publish Date - 2023-05-10T14:56:10+05:30

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు నారా లోకేష్ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు(AP Governor Abdul Nazeer) నారా లోకేష్ (Nara Lokesh) లేఖ రాశారు. ముస్లిం మైనారిటీలపై దాడులు చేసే నేరస్తుల్ని ప్రోత్సహించేలా వైసీపీ ప్రభుత్వ చర్యలున్నాయని లేఖలో పేర్కొన్నారు. చాలా ఘటనల్లో వైసీపీ శ్రేణులే ముస్లిం మైనార్టీలపై దాడులకు పాల్పడితే అధికార పార్టీ ఒత్తిడితో కొంతమంది పోలీసులు నేరస్థులతో చేతులు కలిపి కేసులు నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనార్టీలపై చోటు చేసుకున్న 50 ఘటనలు, తన దృష్టికి వచ్చిన సంఘటనల వివరాలను తన లేఖకు యువనేత జత చేశారు. వైసీపీ వేధింపుల వల్ల నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య, పల్నాడు ప్రాంతంలో ముస్లిం మైనార్టీల ఆస్తులపై దాడులు, హత్యలు, గెంటివేతల అంశాలు, పులివెందుల సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలను సవివరంగా లేఖకు జతచేశారు. లౌకిక వాదంపై జరిగే దాడుల్లో గవర్నర్ జోక్యం అవసరమని విజ్ఞప్తి చేశారు.

లోకేష్ లేఖ సారాంశం...

  • రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను మరింత వెనుకబాటుతనం, పేదరికంలోకి నెట్టే విధంగా వైసిపి ప్రభుత్వ చర్యలున్నాయి

  • ముస్లిం మైనార్టీల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోంది

  • ఆస్తుల కూల్చివేత, భౌతిక దాడులు, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, తప్పుడు కేసుల నమోదు నుంచి హత్యల వరకూ అనేక విధాల ముస్లింలు హింసకు గురవుతున్నారు.

  • ప్రభుత్వ ప్రేరేపిత చర్యలతో వైసిపి నేతలు చాలా మంది ముస్లిం మైనార్టీల ఆస్తులు లాక్కున్నారు.

  • తప్పుడు కేసులు, బెదిరింపులు, దాడులు, వేధింపులతో ముస్లింలు అనేక అవమానాలకు గురయ్యారు.

  • కొన్నిచోట్ల ఉద్యోగాల నుంచి కూడా తొలగించి జీవనోపాధి కి గండి కొట్టారు.

  • పల్నాడు ప్రాంతంలో పలు చోట్ల టిడిపికి అండగా నిలిచారనే అక్కసుతో ముస్లిం మైనార్టీలను గ్రామ బాహీష్కరణ చేశారు.

  • బాధితులకు పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోగా ఎదురు తప్పుడు కేసులు నమోదు చేశారు.

  • రాష్ట్రంలో ముస్లింలపై జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ జరిపించి దోషులను చట్ట ప్రకారం శిక్షించేలా చూడాలని కోరుతున్నా.

  • మీ సత్వర చర్యలు మాత్రమే ప్రాథమిక హక్కులను కాపాడటంతో పాటు ముస్లిం మైనార్టీలను సంరక్షిస్తుంది.

Updated Date - 2023-05-10T14:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising