ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VarlaRamaiah: దళితులపై జగన్ భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారు

ABN, First Publish Date - 2023-10-16T15:16:14+05:30

దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి దళితులపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా మనువాదాన్ని విడనాడలేకున్నారన్నారు.

అమరావతి: దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jagan reddy) దళితులపై భస్మాసుర హస్తం ప్రయోగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంకా మనువాదాన్ని విడనాడలేకున్నారన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి సస్పెండైన ఒక దుర్మార్గపు నాయకుడై అనంతబాబును సామర్లకోటలో సీఎం జగన్ ప్రక్కన ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఒక మంచి డాక్టర్ సుధాకర్ ఉసురు పోసుకున్న ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిది అంటూ వ్యాఖ్యలు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించిన వర ప్రసాద్‌కు పోలీస్ స్టేషన్‌లోనే గుండు కొట్టించి అవమానించారని... రాష్ట్రప్రతి లేఖ పంపినా వరప్రసాద్‌కు న్యాయం చేయలేదన్నారు. దళిత యువతిని జగన్ మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఒక రూమ్‌లో బంధించి నాలుగు రోజులు మానభంగం చేస్తే చర్యలు శూన్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడిని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి కొట్టి చంపారన్నారు. మద్యం రేట్లు ప్రశ్నించిన ఓం ప్రతాప్‌ అనే దళిత యువకుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మాదిగ మహిళ దారుణంగా మానభంగానికి గురైతే నేటికి న్యాయం జరగలేదన్నారు. డైరక్టర్ స్థాయి అధికారి అయినా డా. అచ్చెన్న మాదిక కులస్తుడిని అతి దారుణంగా హత్య చేశారన్నారు. దళితుడు బెల్ కొట్టి పిలిస్తే సిఎం సామాజిక వర్గం వారు ఒకటై చంపుతారా? జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుడు ఉన్నత స్థానంలో ఉండకూడదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ఇకనైన మదువాదాన్ని విడిచి మానవ విలువలతో పాలన చేయాలని వర్ల రామయ్య హితవుపలికారు.

Updated Date - 2023-10-16T16:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising