ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varlaramaiah: ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా!

ABN, First Publish Date - 2023-06-09T15:29:43+05:30

మాజీ మంత్రి వివేకా హత్య కేసు గురించి జగన్మోహన్ రెడ్డికి బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని సీబీఐ హైకోర్టులో చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య కేసు (YS Viveka Murder Case) గురించి జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy)బయటి ప్రపంచానికంటే ముందే తెలుసని హైకోర్టులో సీబీఐ చెప్పినందుకు నైతిక బాధ్యతవహించి సీఎం వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య గురించి ముందే తెలిసిన జగన్ ఆ విషయం దాచిపెట్టడం ఈ కేసులోని కుట్రలో భాగమే అని ఆరోపించారు. ఆనాడు తెల్లవారుజామున తన ఓఎస్డీ కృష్ణమోహన్ ఫోన్‌కు అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) ఫోన్ చేసినట్టుగా సీబీఐ తెలియచేసిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి సీఎం తనపదవికి రాజీనామా చేయాలన్నారు. ఈ కేసులో సీబీఐ పదేపదే ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించడంపై ఆయన రాష్ట ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హత్యకేసు వివరాలు జగన్‌కు ముందే తెలిసినా, ఆ నెపం చంద్రబాబుపైకి నెట్టడానికి ప్రయత్నించిన కారణాలను కూడా ప్రజలకు తెలియచేయాలని ఆయన అన్నారు.

హత్య జరిగిన నాటి రాత్రి ఓఎస్డీ ఫోన్ తన దగ్గర, అటెండర్ నవీన్ ఫోన్ భారతిరెడ్డి దగ్గర ఎందుకున్నాయో చెప్పాలన్నారు. ఈ కేసులో అందరివేళ్లు సీఎంవైపు చూపిస్తున్న తరుణంలో నైతిక విలువలు పాటించి, తన పదవికి రాజీనామా ఎందుకు చేయరని ప్రశ్నించారు. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పండగ చేసుకోవడమేంటని నిలదీశారు. ముందస్తు బెయిల్ వస్తే నిర్దోషి అని అర్థం కాదు కదా అని అన్నారు. సీబీఐ హైకోర్ట్‌లో వేసిన అఫిడవిట్లో “వివేకా మరణం గురించి ఆరోజు ఉదయం బాహ్యప్రపంచానికి తెలిసింది. కానీ జగన్‌కు ఆ విషయం ముందే తెలుసు అని చెప్పడం ముఖ్యమంత్రి ఈ కుట్రలో భాగస్తుడు” అని తెలుస్తోందన్నారు. సీబీఐ కూడా వివేకా హత్య కేసు దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిర్భీతిగా దర్యాప్తు చేసి, అసలు ముద్దాయిల్ని చట్టానికి పట్టించాలని వర్ల రామయ్య కోరారు.

Updated Date - 2023-06-09T15:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising