ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Leader: గుడివాడలో ఎక్కడ చూసినా సమస్యలే.. మొద్దు నిద్రలో ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-07-31T11:39:48+05:30

జిల్లాలోని గుడివాడ రూరల్ మండలం మోటురులో టీడీపీ నేత వెనిగండ్ల రాము సోమవారం ఉదయం పర్యటించారు.

కృష్ణా జిల్లా: జిల్లాలోని గుడివాడ రూరల్ మండలం మోటురులో టీడీపీ నేత వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu) సోమవారం ఉదయం పర్యటించారు. రైతుల విజ్ఞప్తుల మేరకు పాలకొడు పంట కాలువ పూడికతీతకు సొంత ఖర్చులతో రాము ప్రొక్లేన్ ఏర్పాటు చేశారు. కష్టాల్లో ఉన్న తమను అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ పట్టించుకోలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయన్నారు. పచ్చగా కళకళ్లాడాల్సిన పొలాలు చెరువులను తలపిస్తున్నాయన్నారు. వారం రోజులుగా చేలల్లో నీళ్ళు ఉన్న ఎవ్వరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా ఈ నెల 2న రైతుల సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తామన్నారు. అధికారులు స్పందించకుంటే రైతుల పక్షాన ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గుడివాడలో డ్రైనేజీ వ్యవస్థను కాపాడుకోలేనీ స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందన్నారు. సొంత ఖర్చులతో 30 కిలోమీటర్ల పైగానే కాలువల్లో, డ్రైన్లలో పూడికలు తీయించామన్నారు. ఐదు ప్రోక్లెన్లతో రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. 8 రోజులు గడిచినా రైతులు కష్టాలు పట్టించుకోలేని మొద్దు నిద్రలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పంట నష్టం అంచనా వేసి రైతులకు పరిహారం చెల్లించాలని వెనిగండ్ల రాము డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-31T11:39:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising