ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yanamala Ramakrishnudu: ఏపీ ఆర్థికస్థితిపై చర్చకు ఎప్పుడో సిద్దమని చెప్పాం

ABN, First Publish Date - 2023-06-16T13:31:18+05:30

రాష్ట్ర ఆర్థికస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని.. దానికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని.. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ఆర్థికస్థితిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) బహిరంగ చర్చకు వస్తే.. తాము సిద్ధమని గతంలోనే చెప్పామని.. దానికి కట్టుబడి ఉన్నామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి అడ్డగోలుగా అబద్దాలు చెప్పి వెళ్లిపోవడం కాదని.. దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల రాకతో ఆదాయం సమకూరితే, ప్రస్తుతం అప్పులపైనే ఆధారపడిన పరిస్థితి అన్నారు. నాడు విభజన సమస్యలు వెంటాడుతున్నప్పటికీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.1.86 లక్షల కోట్లు మాత్రమే అని.. నేడు జగన్ రెడ్డి నాలుగేళ్లలో చేసిన అప్పు రూ. 7 లక్షల కోట్లని చెప్పుకొచ్చారు. రోజూ ఆర్బీఐ ముందు అప్పుల కోసం మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. మద్యం అమ్మకాలను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న దిక్కుమాలిన పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. వైసీపీ నాయకుల ఆదాయం 200 రెట్లు పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రజల ఆదాయం మాత్రం తరుగుతూ ఉందన్నారు. రాష్ట్రంలో సహజవనరులు లూటీ అవుతున్నాయని.. పరిశ్రమలు జగన్ రెడ్డి అనుచరులకు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యులపరం అవుతున్నాయన్నారు. ఏ రాష్ట్రానికైన ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని.. కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ అనే మాటకు అర్ధం కూడా తెలియదని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-16T13:54:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising