TDP MP: కేంద్రం దగ్గర సీఎం పదవిని జగన్ తాకట్టుపెట్టారు
ABN, First Publish Date - 2023-02-01T18:25:01+05:30
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ 2023 (Union budget)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ 2023 (Union budget)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు (MP Rammohan Naidu) ఆరోపించారు. నాలుగేళ్లలో ప్రజాసమస్యలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan Mohan Reddy) ఒక్క సమావేశం కూడా పెట్టలేదని రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. కేంద్రం దగ్గర ఏపీని, ప్రజల్ని, సీఎం పదవిని జగన్ తాకట్టుపెట్టారని రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విభజన హామీలు, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశారా?, బడ్జెట్ ముందు ఎంపీలతో ఒక్క మీటింగ్ అయినా పెట్టారా? అని రామ్మోహన్ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏం అడగాలనేదానిపై మీ ఎంపీలకు ఒక్క సూచన అయినా చేశారా?, టీడీపీ (TDP) హయాంలో బీజేపీ (BJP) సర్కార్‌పై ఒత్తిడి తెచ్చామని రామ్మోహన్ అన్నారు.
మోదీపై ఒత్తిడి తెచ్చే ధైర్యం జగన్‌కు లేదని, జగన్, తన కుటుంబీకులను కాపాడుకునేందుకు ఢిల్లీకి ఎన్ని టూర్లు చేస్తారు? అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. వడ్డీలు కట్టేందుకు కూడా అప్పులు చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చేరుకుందని రామ్మోహన్‌నాయుడు మండిపడ్డారు.
Updated Date - 2023-02-01T18:27:32+05:30 IST