ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: ప్రత్యర్థులపై కామెంట్లతో దాడి.. కార్యకర్తలకు కూలీరేటు పెంచిన జగన్

ABN, First Publish Date - 2023-09-14T20:17:32+05:30

గత ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో కార్యకర్తలను నియమించుకుని ఒక్కో పోస్టుకు రేటు కట్టి ఇచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో ఒక్కో పోస్టుకు రూ.5 మాత్రమే ఇచ్చేవాళ్లు. అయితే ఇప్పుడు పేటీఎం ద్వారా చెల్లించే రేటు రూ.6.5గా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో కూడా తన మార్క్ చూపిస్తోంది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయిలో కార్యకర్తలను నియమించుకుని ఒక్కో పోస్టుకు రేటు కట్టి ఇచ్చిన వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలో ఒక్కో పోస్టుకు రూ.5 మాత్రమే ఇచ్చేవాళ్లు. అయితే ఇప్పుడు పేటీఎం ద్వారా చెల్లించే రేటు రూ.6.5గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది. చంద్రబాబు గారి పుణ్యమా అంటూ పేటీఎం గాళ్లకు కూలి రేటు పెంచిన జగన్ అంటూ ఎద్దేవా చేసింది. వైసీపీ నేతలు పెట్టిన పోస్టులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్లకు పేటీఎం ద్వారా నగదు పంపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: NCBN Arrest : చంద్రబాబు కేసులో కీలక పరిణామం.. రేపు శుభవార్త ఉంటుందా..!?

అటు ‘ఇదే చంద్రబాబు గారి గొప్పతనం. ఆయన అధికారంలో ఉన్నప్పుడు లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు అధికారపక్షం కక్ష గట్టి ఆయన్ను జైలుకు పంపినా... వైసీపీ పేటీఎం గాళ్ళకి ఆయన పేరుతో మేలే జరుగుతుంది’ అంటూ తెలుగు దేశం పార్టీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. మరోవైపు ప్రత్యర్థులపై విమర్శల దాడి చేయడం అనేది వైసీపీ కార్యకర్తలకు వెన్నతో పెట్టిన విద్య. శారీరకంగా, మానసికంగా వేధిస్తూ పోస్టులు పెట్టడం గత నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. వీళ్ల పోస్టులపై పోలీసులు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టిన ఐటీ ఉద్యోగులను ఉద్దేశిస్తూ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. నిరసన తెలిపేందుకు వచ్చిన వాళ్లకు రూ.5వేలు విలువ చేసే స్విగ్గీ కూపన్ ఇస్తున్నట్లు విషప్రచారానికి ఒడిగట్టారు. దీనిపై ఇప్పటికే పలువురు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు .

Updated Date - 2023-09-14T20:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising